మొదలున్నది కవనానికి తుది లేదు విధిరాతలొ
తన పేరే నాకధలో రాయలేదు విధిరాతలొ
గాలివాలు ధూళి తాక రూపురేఖ మారిపోదు
నాణ్యమైన న్యాయాలను చూపలేదు విధిరాతలొ
నవ్వుతున్న గుండె గొంతు నొక్కినాను ముప్పిరిలో
అదృష్టం అందరికీ పంచలేదు విధి రాతలొ
కలలుడిగిన కన్నులతో కన్నీరే చెప్పుకుంది
అశృవులను అమృతంగ మార్చలేదు విధి రాతలొ
వెలుగులెన్నొ నింపుకొచ్చు వెండినావ మునిగిపోయె
తీరంలో విజయాన్నే చూపలేదు విధి రాతలొ