శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
భావాలే భ్రమరాలై భాసిల్లిన వైభవం
సుమవనిలో రసధునిగా రాజిల్లిన వైభవం
అరవిరిసిన ప్రతిసుమమూఅడుగుతుంది కైవల్యం
అర్హతలే అందమంటు విరపూసిన వైభవం
మల్లెలతో మరువాలే కలిసివుంటే పరవశమె
సత్సంగం సద్భావన స్నేహించిన వైభవం
శక్తి కైన కావాలిగ శివుడి ఆన అడుగేయ
దేహముగా కైలాసమే విలసిల్లిన వైభవం
సిరిదేవత అడుగిడితే ఇంటింటా “విజయం
విధిరాతను వాగ్దేవియె లిఖియించిన వైభవం