శుభోదయం 🌹🌹🌹🌹🌹
FB గుర్తు చేసిన గజల్ …
“చిత్రవీణ “
గజల్ విజయ గోలి…
చేలగట్టు వైరమంత చెరుపుకుంటె చెలిమేగా
వెంటరాని సంపదలను వదులుకుంటె చెలిమేగా
గట్టుమీద పారాడిన గుమ్మడంత ఉమ్మడేగ
ఆటలలో అరటిపండు గురుతుంటే చెలిమేగా
గొబ్బిపూల అందాలతొ గోరింటల చందాలుగ
పంటసాగు నీటినంత పంచుకుంటె చెలిమేగా
బంధమెపుడు బాటవెతుకు కలసిపోవు కబురుకొరకు
మధ్యవచ్చు మంధరలే మారుతుంటె చెలిమేగా
బంతిపూల తోరణాలు భాగమౌను *విజయా లలొ
కన్నవాళ్ళ కలలుతెలిసి కలిసుంటే చెలిమేగా!!