శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పరుచుకున్న నీలికురులు పల్లవిగా పలికించును
ఋతు రాగపు శోభలతో మొయిలు నీడ మరిపించును
ముని మాపుల తెలి మబ్బుల తెరచాటున ఇనబింబం
సింధూరపు వర్ణమునే చెలి చెక్కిట మెరిపించును
మిణుకుమనే తొలిచుక్కలొ తళుకుమన్న ముక్కు పుడక
తారలతో దోబూచుల ఆటలలో మురిపించును
తడిచిన మువ్వల సడిలా తన్మయమే నవ్వుల జడి
వెన్నెలలో జలతారుల మెరుపులనే అలరించును
తుళ్ళిపడే జింక తాను రివ్వుమనే గువ్వ తాను
తెలిమబ్బుల పరుగులెత్తు నెలవంకను తలపించును
రాయంచల సొగసు తెలుపు కదలికలో కడలి సొంపు
నాట్యంలో మయూరమై నయగారం ఒలికించును
ఉషోదయపు వెలుగులలో తుషారమే ఆ చూపులు
సఖి రూపం కోవెలలో దీపంగా ప్రజ్వలించు!!