శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
వెనువెంటగ కంట పడని తోడంటే మృత్యువేగ
మరుజన్మకు మలుపులేని బాటంటే మృత్యువేగ
నేలబడిన నాటినుండి నిక్కమైన నేస్తమదీ
అడుగడుగున అప్పులతో బంధమంటె మృత్యువేగ
ఒక్క సారి ఒడిలోనికి వాల్చుకునే వాత్సల్యం
ఎవ్వరికీ నిను పంచని వలపంటే మృత్యువేగ
కర్మ సాక్షి సూర్యునికే తప్పనివే కాలగతులు
విశ్వమంత విస్తరించు వెలుగంటే మృత్యువేగ
నీ నడతకు చిరునామా నీ నవ్వుకు నజరానా
గీతలలో రాత తెలుపు విజయమంటె మృత్యువేగ