శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఎదురు పడిన కన్నుల్లో ఎగిసి పడిన కెరటాలు
కుశలమడుగు తీరులోన విరిగి పడిన కెరటాలు
వణుకుతున్న పెదవులపై వొదిగివున్న పిలుపులో
పలికేనులె మధు మురళీ మృదు రవళీ రాగాలు
మనసులోకి తొంగి చూచు మర్మమేదొ తెలిసుంటె
ఎరుక పడును ఎద దాగిన వేల వేల భావాలు
కడలి ఒడ్డు కట్టుకున్న ఇసుక గూడు ముచ్చట్లు
గడిచి నట్టి కాలమంత గగనానా గమకాలు
అనుకోనీ ఆత్మీయం ఆలింగన అమృతం
విరి సుమమై జాలువారు విజయమైన భాష్పాలు!!