చేతి లోని రేఖలు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

చేతిలోని రేఖలలో ఏమున్నదొ… కుదురు లేదు
ఆ గీతల ఒక రాతగ నువ్వుంటే ఎదురు లేదు

వేల వేల దీపాలను కనులనింపి నిలిచినాను
ఊహనైన… ఎడబాటుల చీకటికిక తావు లేదు

చిరు ఆశల అనుభూతుల అందాలను కవనంగా …
హత్తుకునే అక్షరాల హరివిల్లుకు బెదురు లేదు

నీ ఊసులు స్వరఝరిగా నను తాకెను శ్రీ రాగం
మోసుకొచ్చి చెలరేగే గాలికింక అదుపులేదు

వలపు పిలుపు విజయంగా నీ తలపుల మేనాలో
పరవశించి పయనించే ప్రణయాలకు అలుపు లేదు .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language