శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పాడుకున్న ప్రేమగీతి గాయంగా రగులుతుంది
కాలంతో నడిచి నడిచి కాఫిన్లో ఒదుగుతుంది
తిరిగి చూడు వేకువలో వెన్నెలింటి శిథిలాలను
తరుగుతున్న చందమామ కళలు మాసి కదులుతుంది
మసకేసిన మబ్బులలో మన చెలిమి సంతకమే
నిర్వేదపు జడివానకు నిలువ లేక జారుతుంది
తిరిగి రాని వసంతంగ తిరగ రాసె ఋతు రాగం
తీరిపోని ఋణంగానె వెన్నంటీ తిరుగుతుంది
చీకటిలో రెపరెపగా నువు రాయని చిరునామా
ఓడి గెలిచి విజయ వీధి విపంచిగా పాడుతుంది