మహాత్మా..

రేపు మహాత్ముడి వర్ధంతి

భారత మాత అత్యుత్తమ పుత్రుడిని కోల్పోయిన రోజు

మనదేశం  ఒక మహనీయుడిని కోల్పోయిన రోజు .

దేశం కోసమే పుట్టి   దేశం కోసమే పెరిగి

        జీవితాన్ని ఫణంగా పెట్టి

ఒక మతోన్మాది చేతిలో అసువులు  బాసిన

భారత జాతిపిత  మహర్షి మహా మనీషి మహాత్మా గాంధీజీ

వర్ధంతి సందర్భంగా నివాళు లర్పిస్తూ ..నా చిరు కవిత

నిజానికి అహింస అనే ఆయుధానికి బదులు మరొక ఆయుధం రావొచ్చేమో

        స్వాతంత్ర్య ఉద్యమంలో సంపూర్ణ భారత జాతిని ఒక్క త్రాటి పై నడిపిన

              మహాత్ముని మించిన మహా నాయకుడు మాత్రం మరి రాడు .

నీవొక్కడివే ….

మహర్షీ..

సత్యాన్నే శస్త్రంగా

అహింస యే అస్త్రంగా

చెరగని బోసినవ్వుతో

బక్క దేహాన ఉక్కు గుండెతో

భారతావని బంధ విముక్తి కై

చేతికర్ర  ఊతమిచ్చిన

ఉప్పు ఉద్యమ కారీ ..

  బాపూజీ

అణువు అణువున

స్ఫూర్తి నింపుతూ

అడుగు అడుగున

ఆత్మ బలమే నీవుగా

తెల్ల వారి గుండెలపై

అహింస బల్లెమే గుచ్చావు

సమర శంఖునినాదమే నీవై

సాధించావు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని

మహాత్మా..

చెడు వినకు. చెడు అనకు

చెడు కనకు  సూక్తిగా

భాయి భాయంటూ

బంధాలు కలిపి

శత్రువును ప్రేమించమన్నావు.

శాంతి సమరాన సమిధ వయ్యావు

జాతిపితగా జగతి నిలిచావు .

మహాత్మానీ అడుగుజాడలే ..

మాకు అనుసరణీయం

మహర్షీ  నీ వ్యక్తిత్వమే మాకు స్ఫూర్తి

అప్పటికి ..ఇప్పటికిఎప్పటికీ

అవని ..ఆకాశాలున్నంతవరకు ..

.భారత జాతిపిత .. నీవే..నీవొక్కడివే

నీ వొక్కడివే. నీ ఒక్కడివే  నీ ఒక్కడివే 🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language