శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
మందాకిని మలుపులలో వలపు జల్లు కురిసినదీ
వసంతమే వనమాలై పరవశంగ విరిసినదీ
తపోవనపు తరుఛాయల… విరహములో శాకుంతల
వ్రాసుకున్న తలపు లేఖ తమి తీరక తడిసినదీ
ప్రకృతిలో పరిమళమే ప్రణయాల రాగమయం
శుక పికముల పరిణయమే సుందరమై ఒప్పినదీ
నీలి మబ్బు ఛాయలలో వెండి మెరుపు గీత లలో
కనిపించే చిత్తరువే కను వెలుగై మెరిసినదీ
మధుహాసపు మధుపములే మన్మధునీ శరములుగా
మధువులతో విజయంగా తీపి విందు చేసినదీ!!