నీ తోడుగ

శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి

ఏ తలపుల మునిగిననూ తడవనీయి నీ తోడుగ
ఏదారుల నడకున్నా నడువనీయి నీ తోడుగ

బంధంగా అల్లుకుంటె బరువుకాను ఏనాటికి
ఏడు జన్మల ఏరువాక పాడనీయి నీతోడుగ

వదిలి పోకు నా చేతిని… వరమీయవ కడదాకా
సన్నిధియే స్వర్గంగా సాగనీయి నీ తోడుగ

దూరమైన భావనంటె మరణంగా మరుజన్మే
ఆశతీర అలరించగ ఆనతీయి నీతోడుగ

మౌనమంటె అలకలనకు …మాటలతో మంత్రమేల
మనసు లోని మధురిమలే  పంచనీయి నీ తోడుగ

అద్దంలో నీరూపుకు ప్రతిరూపం ప్రేమేగా
పరుల దృష్టి పడకుండా దాచనీయి నీతోడుగ

పగలు రాత్రి పరుగులెపుడు ఆగిపోనొ ఎవరికెరుక
విజయాలనె దివ్వెలుగా వెలగనీయి నీ తోడుగ!!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language