శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
బండరాయికి గుండెనిచ్చి బంధమంటు మురిసియుంటిని
ముక్కలైనా గాజు పలక అతుకులేసి అలసియుంటిని
స్వప్న సౌధం కూలిపోగ కలలు విరిగి కత్తులైనవి
ఎదను చీల్చుతు గుచ్చుతుంటె గుట్టుదాచి నవ్వుతుంటిని
బ్రతుకు రాతగ అతుకు గీత అమరిపోయె నుదుటి పైనా
చెలిమి వదలని చింతలోన చితిని పేర్చి వేచియుంటిని
విధిని తలుచుకు విజయముగా విడవ లేను ప్రేమ నీ యెడ
మరపునైనా మధుపాత్రలొ నను చూడగ కోరుకుంటిని
కరుణ చూపగ కఫను కప్పగ వత్తువేమొ కడసారిగా
పోవు ప్రాణం పయనమాగు …వద్దువద్దని వేడుతుంటిని!!