శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఆటపాటల చిన్న నాడే ప్రభువు నీవని కొలుచుకుంటిని
మనసువేదిక చేసుకుంటిని మందిరాన్నే మలుచుకుంటిని
రాగ రవళిన రాచ కేళిలొ పరవశించే రాధ కానులె
కోవెలందున కొలువు దీరగ భక్తి” మీరా” కోరుకుంటిని
మువ్వసొగసులె సవ్వడి చేయ ఆడి పాడితి ఆశ తీరగ
కలలనిండిన దివ్య హాసమె కనుల చూడగ వేడుకుంటిని
కాలకూటమె కానుకిచ్చిరి అయినవారను కానివారలు
నీ నామమే పానమవగా పరమపదమునె యెంచుకుంటిని
పాషాణమే పంచదారల పాయసమాయె…పరంధామా
కనులనిండుగ నీరూపమై కైవల్య విజయమె కాంచుచుంటిని