శుభకృత్ ఉగాది 2/04/2022
ఎన్ని రంగులు ఎన్ని హంగులు
సృష్టి హాసం ఎంత మధురం
పల్లవించే చిగురు సొగసులు
అల్లుకున్న ఆశల వల్లరికి స్వాగతం
అవని నిండిన హరిత వర్ణం
ఆమని వీచిక రాగ రంజితం
పూవు పూవుకు తేనె నింపిన
పూల ఋతువుకు స్వాగతం
గున్నమావిన కొత్తరాగం
వగరు పులుపుగ పలుకుతుంటె
వేపపూవుల మధువు మత్తుకు
వంతపాడే కుహు కుహూలకు స్వాగతం
ఛైత్రమాసపు చిత్ర వన్నెలు
రామచిలుకల తేరునెక్కిన
మరుని శరముల మల్లెలవగా
కొత్త కోర్కెల కొలువుకిదె స్వాగతం
ఉభయ కుశలమై ఉగాది
ఆరు రుచుల ఆరు ఋతువులు
నిత్యవసంత గీతమై
నిలిచి పోయే శోభనిమ్మని
శుభకృత్ కు సుస్వాగతం