ప్రేమంటే విశ్వానికి ఇరుసు
బంధాలతొ బంధించే గొలుసు
సృష్టిలోన ప్రేమంటే ..
చెలిమి నింపు మనసు
ప్రణయమొకటె ప్రేమంటే ..
ప్రణవంలో దాగున్న
పరమార్ధం మాటేమిటి?
మనిషి మనిషి మధ్యన
మమతల వంతెన పేరేమిటి?
అణువు అణువు నిండివుంది
భగవంతుని అమర ప్రేమ
జననాలకు మరణాలకు
సూత్రమైన సూక్షము
ఆస్వాదన అమృతం
ఆదరణే అసలైన అమ్మప్రేమ !
క్షణికమైన సుఖాలకు
ప్రేమంటూ పేరు పెట్టి
ఆకర్షణ అగ్నిలోన
ఆహుతయ్యే ..యువత
ఇరుకు ఇరుకు ఆలోచన ..
వీడకుంటే భవిత లేదు
పరిమళాల జల్లులలో
పరవశించు ప్రేమతత్వం
విశ్వ ప్రేమ తెలుసుకుంటే ..
విలువలతో జీవితమే
విరబూసిన పూల వనం