నా ఆశల పల్లకి
కలకాలపు కలలసంతకం
వినువీధినవిహంగం
విజ్ఞాన వీవనల విస్తారం
ఆశేశ్వాసగ అనితరపయనం
ఆశయాల అనుసంధానం
సాకారపు సాధనమధనం
సస్య శ్యామల సందేశం
గుప్పిట దాగిన ఆశల రేఖలు ..
అందమైన సీతాకోకలై రెక్కలు విప్పిన వేళ..
అరచేతి అంచులనుండి అంబరవీధికి..
సంగీత నాట్యాల సమ్మేళనం
విజయ గోలి .7 /12 /2018