ఆత్మీయ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹
శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అమావస్య పున్నమిగా మెరిసినదీ దీపావళి
తిమిరంతో సమరంలో గెలిచినదీ దీపావళి
రాక్షసులను వేటాడగ రమణులదే ధీరత్వం
సత్యభామ సాహసంలొ వెలిసినదీ దీపావళి
నింగితాకు జువ్వలన్ని నేలతాకు నిమిషములో
ఎగిరిపడే మృగజాతిని కూల్చినదీ దీపావళి
సిరిసంపద వెల్లివిరియ చిరుదివ్వెల ఆహ్వానం
ఇంటింటా ఆనందం విరిసినదీ దీపావళి
చిటపటలా చిచ్చుబుడ్డి మతాబులా మతలబులో
అజ్ఞానపు చీకట్లను అణచినదీ దీపావళి
అవనిమీద వెలుగులనే అంబరాన నింపినదీ
పూబంతుల రంగవల్లి మురిసినదీ దీపావళి
మనసంతా సగుణత్వం నింపుకున్న కాంతులలో
విజయాలకు స్వాగతాలు పలికినదీ దీపావళి.