ధరణీ దినోత్సవం

ధరణీ దినోత్సవం    విజయ గోలి. 22/4/2021

సస్యశ్యామలమై..

సుగంధ పరిమళాల

పల్లవించిన ధరణి

వట్టి బోయిన మట్టి నేడు

కొండ కోనల కొరివి పెట్టి

బాపుకున్న బ్రతుకులేమిటి

భూమితల్లి భవితనంతా

బుగ్గిపాలు చేసిపోస్తిరి

అభివృధ్ది పేరుతో

కాలకూట విషము

కడుపు నింపిరి

కాలుష్యమే పెంచి

అంపశయ్య పై అవనినుంచిరి

మేలుకుని ఇకపైన

ధరణి సహనము పరీక్షించక

పట్టుదలతోకలసి కట్టుగ

పట్టెదము గాక ఒక వ్రతము

కాలుష్య రహిత కర్మ భూమిగ

పుడమి తల్లిని కాచుకుందాం

పురిటిగడ్డకు భవితనిస్తూ….

చిగురులేసే చిట్టి బ్రతుకులు బ్రతకనిద్దాం

భావి పౌరులకు ఆయువిద్దాం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language