రచన-: విజయ గోలి
ప్రక్రియ –వచన కవిత
దశమ శక్తి పీఠం ..పీఠ్యాయాం పురుహూతికా దేవి
శ్రీ సతి పీఠమే శ్రీ పీఠమై విలసిల్ల
ఆదిశక్తియే పురుహూతికా దేవియైవెలిసి
పరమపావనియై పాలించు భక్తుల
ధర్మపీఠముగ పిఠాపురము ధరణి నిలిచె.
కరుణచూపు తల్లి కమలాక్షి
మందారవల్లియై మహిమ చూపు
కుక్కుటేశ్వరునికి కులసతిగ
కొలువుండి తల్లిగ కోరికలు తీర్చేను
గయుని సంహారమొనరించ
గయుని దేహమే యజ్ఞపీఠిక చేసి
త్రిమూర్తులు యాగము చేయ
పూర్ణాహుతి కిముందుగా
పరమశివుడు కుక్కుటమై కూసి
కదిలిన గయుని అంతమొందించి
పాదగయగ పావనత్వము నిచ్చి
పితృకార్యముల పిండదానముల
కాశీకి సమముగ పుణ్యపురమాయె
కోనేరు తీరుగ కుక్కుటేశ్వర లింగమై
కొలువాయె స్వామి కొలిచిన వారి కోరికలు తీర్చ
శ్రీ పాదవల్లభుడు .అనఘా దేవి తోడుగా
శ్రీ దత్త క్షేత్రుడై ఎనలేని..దయచూపు .
శ్రీ మల్లినాధ సూరి కళాపీఠము ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యము
సప్తవర్ణాల సింగిడి 3/12/20
అంశం– కార్తీక మహోత్సవములు ..ఓఢ్యాయాం గిరిజా దేవి
నిర్వహణ-: పురాణ కవులు శ్రీ బి వెంకట్ కవి గారు
శ్రీ బాబు రావు గారు.శ్రీమతి సమత గారు
రచన -:విజయ గోలి
ప్రక్రియ -: వచనం
అష్టాదశ పీఠాలలో
ఏకాదశ పీఠం ..ఓఢ్యాయాం గిరిజాదేవి
జాజ్పూర్ రాజాస్థాన పరిసరాలలో
ఓఢ్యాణా గ్రామంలో వైతరణీ నదీ తీరములో
సతీదేవి నాభి భాగము శక్తి పీఠమై ఆదిశక్తి
గిరిజాదేవి రూపమై ఓఢ్యాణ పీఠనిలయగా
బిందుమండల వాసినిగ మహిమాన్వితము
మహిషాసుర మర్ధని గా ద్విభుజములతో
ఒకచేత మహిషుని వాలము పట్టి
వామపాదమున మహిషుని తొక్కుతూ మరొక చేత
త్రిశూలముతో రాక్షసుని పొడుస్తున్న మూలరూపము
బ్రహ్మ క్షేత్ర పాలకుడై అమ్మను అర్చించు నిత్యము
విధాత కోరిక మేర పార్వతీ దేవి త్రిశక్తి రూపమై
విరజాదేవిగా భక్తులపాలిటి భగవతి సాక్షాత్కారము
నవదుర్గల సమూహముతో ఓఢ్యాణ పురవాసిని
సర్వదేవతలు నిత్యము పూజించు వరదాయని
వైతరణీ న వెలసిన ఆదివరాహ రూపిగ విష్ణువు
పరమ పూజ్యము…వైతరణీ నది స్నానము
సర్వ పాపహరము ..పుణ్య వితరణము
శ్రాద్ధకర్మల పితృదేవతల మోక్ష ప్రదము..