లేఖ

లేఖ……విజయ గోలి

ప్రియాతి ప్రియమైన  నా ప్రాణమా !🌹🌹

నీ రాక కబురు విన్నదగ్గరనుండి ….కాలం మత్తునిదుర

పోతుంది.బద్దకంగా వళ్ళు విరుచుకుంటుంది

పరిగెత్తే నా మనసు మాత్రం అష్టవిధ నాయికగా

నాట్యం చేస్తుంది..నిలువుటద్దం  నిగనిగలు నింపుకుంటుంది

వలపు సరిగమలు శృతి చేసుకుంటుంది

నీ ఊసుల గుసగుసలు నా కురుల మాటుగా

వాయులీనమై మనసు మురిపిస్తుంది

కలత నిదురలో కల కన్నానేమో ….

నిశిరాతిరి నిశ్శబ్దం ఓదార్పులాడుతుంది.

దూరాలు చాలా భారంగా తరుగుతున్నాయి ….

ఎడబాటు …ప్రతిపనిలో తడబాటు చూపుతుంది ..

నేను వ్రాసే వూసుల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తావు …

వస్తున్నావుగా …అందుకే కబుర్లేమి వ్రాయటం లేదు 

దాచివుంచిన వూసులన్నీ ..కొంగున ముడివేసి వుంచాను 

నువ్వు వచ్చేవరకు ..నా హృదయం …

మేఘమల్హరి  ఆలపిస్తూనే ఉంటుంది .. 

చినుకువై .. స్పృశిస్తావో ..చిరుజల్లుల  చిలకరింతలిస్తావో …

వానవై .. చుట్టేస్తావో ..వరదవై ..ముంచేస్తావో ……

నీ పలకరింతల …పులకరింతలలో ..

తరించాలని ..తపిస్తూ ……నీ  ప్రాణం !🌹🌹

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language