శీర్షిక -: ఆరని చిచ్చు విజయ గోలి
కడుపార కన్నదిరా మీఅమ్మ
ఆశదీర పెంచాముర ఓఅయ్యా
.కడుపు కట్టుకున్న ..కష్టపడినా
కన్నీరు పెట్టలేదురా. ..కొడకా
కలిమంతా నువ్వేనని పెంచామురా
దొరల బడిన జేర్పించి
దొరవే నీవని మురిసితిమి.
చదివినావు చక్కగని
సంబరపడి పోతిమి.
చదువు ఇచ్చె సంపాదన
కలలన్నీ తీరినాయి
కడగండ్లు పోయినాయి
సంతోషమే సవ్వడాయె
ఆశమీద ఆశపెరిగే
పిల్లంటివి ప్రేమంటివి
పెద్దింటిది ఆపిల్ల
వొల్లనంది నిన్నంటివి
ఆగమాయె బ్రతుకంటూ
అర్ధాంతర మెల్లిపోతివి
గుండెనిండ గునపముతో
గుచ్చి గుచ్చి చీలిస్తివి
ఇది ఏమి న్యాయమురో
నిన్న మొన్న పిల్ల కొరకు
మా కంటిదీపమార్పేస్తివి
చూపులేక బ్రతుకెక్కడ
కడసారిగ అమ్మ అయ్య
తలపు లేకపోయెనే
మాయదారి ప్రేమలతో
కడుపుచిచ్చు పెడితివిగా
ఆరని మంటలతో
ఇక అడుగెక్కడ సాగేనురా
కుర్రాళ్ళు ..కూసింత ఆలోచించండిర
అరచేతల పెంచిన అమ్మ నాన్నల
గతి యేమిటొ..జీవాలతొ శవాలనే చేయొద్దుర