ఎదురుచూపు

ఎ

ఎదురుచూపు విజయ గోలి

ఒంటరి తనమంటే

జంట మనసు కూడ

తోడు రాక పోవడమే

గతమంతా శూన్యమై

బ్రతుకు లేకపోవడమే

ఓపికుడిగి పోయాకె

నీకు నీవు తెలిసేది

నెర్రిలిచ్చిన నేలకు తెలుసు

నీ ముదిమికెంత వయసో

బీడుపడ్డ భూమికి తెలుసు

ఆ బంధమెంత గట్టిదో

అయ్యచేయి పట్టి

ఆభూమిన అడుగెట్టిన

నాటినుండి  నేటివరకు

వయసంతా ఎదురుచూపు

వింతకధే నీ బ్రతుకు

ఎడారిలో  మేఘంకై

వెతుకులాడి అలిసావు

కన్నీటితొ  విత్తుతడిపి

కాలమంత చూసేవు

కరుణించని కాలానికి

దాసోహ మింకెందుకు

ఇకనైన ఆ తనువుకు

కూసింత విరామమివ్వు

ఎవరికొరకు ఎదురుచూపు

చూడకున్నా  తరుముకొచ్చు

కోరని ఆ మృత్యువు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language