రామనామ తారకం విజయ గోలి
దశరధ రాముడంట
ధరణియందు ధర్మమంట
అందాల రాముడంట
అవనిజ నాధుడంట
సాకేత రాముడంట
సకలగుణాభి దేవుడంట
రాముడంటె ఒకమాట
ఒక బాణం ఒక బాట
ఒక జానకి తన ప్రాణం
రాముడే మన భక్తి
రాముడొక్కడే మన శక్తి
రాముడంటె శాంతము
రాముడంటె కరుణ
రాముడంటే కలిమి
రాముడంటె చెలిమి
రాముడంటె రక్ష
సర్వము శ్రీ రాముడే
ఆసేతు హిమాచలం
రామనామమె తారకం
రామభూమిగ భారతం
జన్మభూమిగ అయోధ్య
రాజ్యమేలునిక నిరంతరం
పాపమంటె రావణుడు
పారద్రోలు రామజపం
పరమపదపు సోపానం
పావనమే ఆ నామం
జయం శ్రీరామ జయం