గజల్ విజయ గోలి
మౌనమేల చీకటినే దుప్పటిగా కప్పుకుంది..
ఎవరిననీ అడగగలను ఎందుకిలా జరుగుతుంది
ఆగిపోయి శ్వాసలేల ఎగిరిపోయె ఎక్కడికో
గుండెనొదిలి చప్పుడెలా గుట్టుగాను దాగుతుంది
సద్దుమణిగె సంతోషం ఎక్కడనీ వెతకగలను
సమయమేల సాగిపోక స్థాణువుగా నిలబడుంది
మదిని దాగి మాటలెన్నో పెదవిదాటి రాకున్నవి
తనువునొదిలి నీడెందుకు నిశీధిలో కదులుతుంది
యోచనకే అందవుగా అంతులేని ప్రశ్నలుగా
కాలమిచ్చు జవాబుకై బ్రతుకుబాట వెతుకుతుంది