శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
తప్పులెంచి గొప్పంటే దిగజారును నీ నడతే
ఎత్తిచూపు వేలెపుడూ మలిపిచూపు నీ నడతే
సభ్యతగా మసులుకుంటె పైమెట్టున నీభవితే
గర్వముతో గతితప్పితె అగాధములు నీ నడతే
ఉలిపికట్ట నేనంటే గిరిగీయును ఊరికట్టు
గురివిందగ బ్రతుకైతే నగుబాటులు నీనడతే
కలతపెంచు కాలుష్యం కడిగేస్తే వదిలిపోవు
మాటతీరు మధురమైతె దారివెలుగు నీనడతే
రెచ్చిపోవు మనిషికుంది రెప్పపాటు సమయమే
విజయముగా వెంటనడుచు ఆ నలుగురు నీ నడతే