ఏకాంతం
విజయ గోలి
చల్లని పున్నమి వెన్నెలలో
ఆపాత మధురాల ఆనందహేల
మది వీడని మధురోహలు
ఊయలూగు విరితావుల
పురివిప్పిన నెమలిగా
పుస్తకాల దొంతరలు
మస్తకాన మరీమరీ
మంతనాలు జరపుతుంటె
సంగీతం సాహిత్యం
సరసమైన కధల మైత్రి
పంచుకునే చెలిమిగా
ఏకాంతం ఎంచుకుంటె ఆనందం