శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
చిరుగాలి నీరాక చెప్పింది ననుతాకి
నీమేని పరిమళమె చుట్టింది ననుతాకి
రేయంత నీధ్యాస నిదురలే కాజేసె
నిలువెల్ల నిప్పుగా కాల్చింది ననుతాకి
మదిలోనె దాగుండి దోబూచు లేలరా
నీరూపు వెన్నెలై నవ్వింది ననుతాకి
తరగనిదె నీతలపు తడవనీ వలపులో
నీపిలుపు వెల్లువై కురిసింది ననుతాకి
నీమురళి రాగమై ఎదురొచ్చి నిలిచింది
మోవిపై మధువులే అద్దింది ననుతాకి