గజల్. విజయ గోలి
తెల్లనైన మల్లెలాగ మనసులన్ని విచ్చుకుంటె శ్రావణమే
విరబూసిన పూవులన్ని పరిమళాలు రువ్వుతుంటె శ్రావణమే
తనువుతడిచి పుడమితల్లి సింగారపు రంగులద్దె ..పరవశమే
తనివితీర ఎలకోయిల ఋతురాగం పాడుతుంటె శ్రావణమే
సందెగాలి పొద్దులలో సాగిపోవు మబ్బులతో సరాగమే
తేలిపోవు మొయిలులాగ వివాదాలె మార్చుకుంటె శ్రావణమే
ఆషాఢపు గడపదాటి ఆవరణలొ సంబరాల స్వాగతమే
వన్నెకాని చూపులతో వలపుశరం గుచ్చుతుంటె శ్రావణమే
సందడిగా సంధ్యలలో సౌభాగ్యం నవ్వుతుంది భాగ్యముగా
విజయాలే కోరుకుంటు పసుపుపంట పంచుకుంటె శ్రావణమే