గజల్ విజయ గోలి
మనసెందుకొ గమ్మత్తుగ గగనవీధి తేలుతుంది
ఏమైనదొ తెలియకుంది ఎదచప్పుడు పెరుగుతుంది
కనుపాపల లాలిపాడ కరుణించదు నిదురతల్లి
కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది
నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల
అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది
కొత్తఋతువు కోరికలతొ మత్తుగాలి వీచేనులె
మెహఫిల్ లొ గజలల్లే మదినితట్టి లేపుతుంది
గుండెగూటి కోయిలమ్మ ప్రేమపాట పాడుతుంది
వీనులలో విజయంగా షహనాయీ మ్రోగుతుంది