కునుకు రాని ప్రతి రేయి

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

కునుకురాని ప్రతిరేయీ కధలాగే సాగుతుంది
కన్నీటితొ కనులకొక్క వ్యధలాగే మిగులుతుంది

కలవాలని అనుక్షణం కలవలేక కలతగానె
కాలమంత మరుగవ్వని కలలాగే కదులుతుంది

మనసెందుకు మాటవినక మారాములు చేస్తున్నది
ప్రేమలలో మత్తేమిటో మాయలాగె మెదులుతుంది

నిప్పులాగె కాలుతుంది నీరులాగె జారుతుంది
యుగళంగా అలజడులతొ పాటలాగె పాడుతుంది

ప్రేమన్నది అతిధిలాగ కాకుంటే విజయములే
చెరిసగమై చేరువైతె మధువులాగె మారుతుంది

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language