ఆడపిల్ల


గజల్. విజయ గోలి

ఆడపిల్ల తండ్రులుగా కొందరిదే ఆనందం
అవనిలోన అమ్మ తాను అందరిదే ఆ బంధం

ఆడబిడ్డ  అనగానే అలుసెందుకు అందరికీ
తలుపుతట్టి అడుగెట్టిన శ్రీదేవియె సిరిచందం

పుట్టింటిన ఘల్లుమంటు నడయాడే పసిడి బొమ్మ
మెట్టింటను పుణ్యముగా కురుయునదే శ్రీ గంధం

ఆప్యాయత అనురాగం అంటివుండు నగలేకద
అల్పమైన సంతోషం అడుగునదే అనుబంధం

అమ్మాయిగా ఆదరణే అందించిన *విజయ మేగ
అంబరాన దేవతలే జల్లునదే సుమగంధం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language