పచ్చదనం పచ్చబొట్టు

మిత్రులందరికీ*ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు🌴🌳🐿🐇🕊🦩🦢🌾🦜🐬🐋🦋🪰🐞🐢🐒🐥🦆🦅🦊🧍🏾🧍🏽‍♂️👫

*పచ్చదనం పచ్చబొట్టు* విజయ గోలి

పరిహసిస్తున్న పర్యావరణం
గాడి తప్పిన ఋతు చక్రం
కరిమబ్బుల కాలంలో కూడా
కడతేరని ఎండలు
నీడ కరువు నీటి కరువు
దడ పుట్టిస్తున్న ధరణి తీరు

పగ బట్టిన పంచభూతాలు
మన్ను మిన్ను గానక
చెల రేగిన స్వార్థానికి
అవిటిదైన ప్రకృతి
అంతరిస్తున్న అమూల్యాలు
చిరునామా చెదిరిన జీవరాశులు

తడి ఆరిన అడవులపై
కార్చిచ్చుల కక్ష తీర్చు కుంటున్నాయి
కాలుష్యపు డ్రాగన్ కాటుకు
అతినీలం స్రవిస్తుంది
కాలుష్యపు కబళింపు
మనుగడనే మసి చేస్తుంది

కళ్ళు తెరిచి పర్యావరణం
కాపాడక పోతే
భావి బ్రతుకు రేషన్‌లో ఆక్సిజన్(కృతిమ)
వరుసలలో అంతమవక తప్పదు

ప్రకృతిలో ప్రతి అణువు
ప్రగతికి పరమపధం
ప్రకృతిని రక్షించే ప్రమాణం చేద్దాం
పచ్చదనాన్ని ప్రేమిద్దాం
పచ్చబొట్టుగా వేసుకుందాం

About the author

Vijaya Goli

Add Comment

Language