*ఉమ్మడి కుటుంబం విజయ గోలి
అడుగంటి పోయిన
ఆత్మీయతా రాగాలలో
అనగనగాఒక కధ ..ఈనాడు
ఆనాటి …ఉమ్మడి కుటుంబం
ఒకే గూటి గువ్వలుగా
ఒక మాటే బాటగా
కష్ట సుఖాలు కలిమి లేములు
కలిసి పంచు కున్న
అందమైన నందనం
ఉమ్మడిగా ఒకే కుటుంబం ….ఆనాడు
జేజమ్మలు తాతయ్యలు
అమ్మమ్మలు నానమ్మలు
పెద్దమ్మలు పెద్దయ్యలు
అత్తలూ…కొత్త కోడళ్ళు
బాబాయిలు మామయ్యలు
పిన్నమ్మలు …మేనత్తలు
అక్కలు …చెల్లెళ్ళు ..బావలు..
అందమైన మరదళ్ళు
అల్లరి తమ్ముళ్ళు
గిజిగాడి గూటిలోని
అందమైన అల్లికలల్లే
విడిపోవని బంధాలతొ
పిలుపుకొక్క బంధమై
నిత్య వసంత గీతం …
ఉమ్మడి కుటుంబం