శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కనులుమూసిన కలికినవ్వులు ఏటిగాలుల ఎగిసివచ్చె
మువ్వ సవ్వడి ముందుగానే గువ్వ పలుకుల ఎగిరివచ్చె
రాధతలపుల వెతలు తీయన వేడుకేలే మాధవునకు
అలిగి వగచే అతివమనసే వలపుదారుల వలచివచ్చె
రామచిలుకల రాయబారమె రమ్యమాయెను రాసలీల
నందనవనమే నాట్యమాడ తళుకు దారుల తరలివచ్చె
ఎదురు చూడక వేణుగానము ఎదలు మీటితె హాయికదా
కలువపూవుల చెలిమిరాగం అలలదారుల కలసి వచ్చె
నీలమేఘుని నిండుహాసమె విశ్వప్రేమల విజయముగా
తనివితీరగ మోహన రూపం వెలుగు దారుల నడచి వచ్చె