శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
గుల్మొహరుల గుత్తులలో నీనవ్వుల గుబాళింపు
హత్తుకున్న పరిమళాల నీసొగసుల మేళవింపు
మత్తిల్లిన చూపులలో రేరాణీ వలపుజల్లు
మధువునింపి అధరాలపై తీయదనం మోహరింపు
వేలవేల తారలలో వెదికననూ దొరకనిదే
కరిమబ్బులొ మెరుపుతీగ వంపులలో నిగారింపు
దోచేసిన నామనసును దాచలేవు కలనైనా
సందెగాలి షహనాయి సరాగాల హొయలునింపు
కలసినడుచు దారులన్నీ కమ్మనైన కబురులుగా
తెలవారని రేయిగాను నీచేతల తలపునింపు