శుభోదయం🌹🌹🌹🌹🌹🌹
చిన్నపుడు ఎంత మంది రెక్కల గుర్రం ఎక్కాలని అనుకుని వుంటారు …
చందమామ కధలు చదివిన ..విన్న ప్రతి వారు అనుకోని వుంటారు ..అవ్వ చెప్పిన కధలు ….ఇప్పటికీ. ..కల్పన అంటే మనసు వొప్పదు ……కదూ…నాకెపుడూ అలాగే వుండేది….ఇప్పటికీ….తలుచుకుంటే….అదే ఆనందం….అందుకే ఇది ఒక సారి చదవండి….
*రెక్కల గుర్రం విజయ గోలి
రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకం
వింతలు చూడాలని ఎంతో ఆశ
చందమామలో రాట్నం వడికే
అవ్వ తోటి మాటాడాలని …
గగనవీధి అంతా గమ్మత్తుల ప్రపంచం
ఒక్కసారి చుట్టిరావాలనే చిన్ని కోరిక
చెవుల పిల్లి కధ ఏంటో కనిపెట్టాలని
అందమైన చందమామ
మోము పైన మచ్చ ఎందుకో అడగాలని ….
నెలవంక ఊయల ఊగి రావాలని
మబ్బు మాటు నీరెక్కడో వెతకాలని ..
ఉరుములు ,మెరుపులు ,
పిడుగుల దడ దడ
దేవ దానవుల యుద్ధమేమిటో చూడాలని…….
తారల తళుకులు కొన్ని
అరువుగా తెచ్చుకోవాలని
దీపావళి దివ్వెలుగ
ఆవరణంతా అమరించాలని
పేదరాశి పెద్దమ్మ చిరునామా
ఆకాశంలో వెతకాలని
అమాయకపు ఆలోచనలో
అందమైన ఆశల మెరుపుల
అవధులు దాటే ఆనందం
వివరం తెలిసినా ..విజ్ఞత పెరిగినా
అంబరమెపుడు సంబరమైనదే
అవ్వ కధల అద్భుతాలు
మాయమవని మకరందాలె
మార్చుకోను ఒప్పుకోని
మరువలేని బంధాలే..