బాపు బొమ్మ కవిత22

విజయ గోలి

ఒంటిగా నను చూసి కొంటె మదనుండు ..

మధుర శరముల వాడిగా యెదను గుచ్చేను…

అధరములు తాకగా..మది వేణువై ఎదురు చూసేను..

నిను అల్లుకోగా …తనువెల్ల విరజాజి తీగ యై విరిసేను.

కాంతుడేడని … కలువలడిగేను..

అలల తడిచిన మువ్వలే మూగపోయాయి ..

ఏ కన్నె కౌగిలి లో కరిగి ఉన్నావో..

ఏ గుండె గుడి లోన వేలుపై ఉన్నావో..

వేడుకొనుచున్నాను …వేగమే రావో..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language