శుభోదయం 🙏🙏 విజయ గోలి
నగుమోమున హరివిల్లే చిరునవ్వుగా మెరిసింది .
ఊహల చిరుగాలి కి తనువు ఊయలయ్యింది.
తమలపాకు పాదాలు తామరాకు పై నర్తనలు..
విస్తుపోతూ ..కలువలు వివరమేమిటన్నాయి .
.
పట్టరాని సంతోషం .. పగలు వెన్నెలేనంటా..
ఎదురు చూపుల వెతలు ఎగిరి పోయేనంట..
కలల కాపురమిక .. కనుల ముందేనంట …
ఎద లోని నా రాజు ఎదుట నిలిచే నంటా…