శుభోదయం 🙏🙏 విజయ గోలి
అల్లరి తగదురా ..గోపాలా…అడిగినదిచ్చితి..కానా..
ఆలసించక.. అరిగెద నేను ..ఆనతినీయరా ..
మల్లెలు విరిసే వేళకు మళ్ళీ వచ్చెద..
కొంగు వదిలి నను కనికరించరా…కన్నయ్యా
వెడలనీయరా.. గోపాలా….వేడుకొందురా ..
వేకువాయెనా… వ్రేపల్లియలో…వేడుకౌదురా .. …
పలుచనౌదురా పడతుల లోన …ప్రణతులిడుదురా …
మలిసంధ్య మాపులకు మరువక వచ్చెద..
జాలి చూపరా ..గోపాలా…ఆలకించరా….