దూకుడేలరా… కన్నయ్యా ..దుందుడుకు చేతలేలరా ..
సందె పొద్దులు చందమామను పిలువనే లేదు…
తళుకు బెళుకు తారలింకా ..మబ్బు తెరలను తీయనే లేదు
మల్లెపూవుల పరిమళాలు చల్లగాలిని తాకనేలేదు. ..
పూబంతులాటకు …సమయమెంతో …వుందిలేరా ..
దూకుడేలరా… కన్నయ్యా ..దుందుడుకు చేతలేలరా .. .విజయ గోలి .