మిత్రులకు ….కవితా దినోత్సవ శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹🌹
*కవితంటే.. విజయ గోలి ..
కవితంటే నీ మనసున
తారాడే తారంగమే
స్పందించిన సమయాన
ఉప్పొంగే అక్షరాల
ఉత్తుంగ తరంగమే
కత్తి కంటే కలమెంతో గొప్పకదా
ఉద్యమాన నినాదమే విత్తు కదా
అభ్యుదయాన కవనమే
ఆదర్శపు ఆలయాలు..
ఆచరణలో సాయుధాలు
అందుకుంటే ఆయుధాలు
ప్రకృతిలో పరవశించు
ప్రభాతాల పరిమళమే
భ్రమరాలై పరిభ్రమించు
భావ రాగ వల్లరులే
ప్రశాంత ప్రణయ గీతికలు
పున్నమి వెన్నెల పరిణయాలు
వ్యధ సొదల వెల్లువ
గుండె బరువుల గాధలు
మనాది మరుపుల మలుపులు
పొంగి పొర్లే కన్నీటి కవనాలు
ఓదార్పుల చల్లని కవితలు
ఆదరించు..అమ్మవడి స్పర్శలు.