గజల్. విజయ గోలి
తలుపుతట్టి పిలిచినవి ఒక్కనాటి తలపులుగా
తలవాకిట నిలిచినవి తొలకరిలో వలపులుగా
కనులలోనె నిలిచినవి కరిగిపోని కలలుగానె
ప్రేమనింపి కైజారుతొ ఎదచిదిమిన గురుతులుగా
గాజుకళ్ళ నీడలలో దస్కత్తుల జ్ఞాపకాలు
చెమ్మగానె తగిలినవి చెక్కిలిపై తడుపులుగా
వేదనేదో వేడుకేదో తెలియకనే తెరలుజారె
తోడురాని నీడకొరకు వేచితినీ యుగములుగా
మరుజన్మకు నీజతనే అడుగుతున్నా అలుపులేక
కడచూపుకు నోచకనే ఆరుతున్న వెలుగులుగా