దరహాసం. గజల్ 2

గజల్ విజయ గోలి

నీతలపున *మోహన మై విరిసెనులే దరహాసం.
నీవలపుల *కళ్యాణిగ మెరిసెనులే దరహాసం

ఉషోదయపు భానుడితో భాసిల్లిన *భూపాలం
హిమచందన తుషారాలు చిలికెనులే దరహాసం

సాగివచ్చు ఆమనికై  వేణువులో  * కీరవాణి
రామచిలుక పలుకులలో ఒలికెనులే దరహాసం

సందెవేళ సన్నజాజి నవ్వులలో * హిందోళం
జడగంటల జావళీలొ కులికెనులే దరహాసం

రేయంతా  రాయంచల రసఝరిలో * నీలాంబరి
“విజయా “లతో *హంసధ్వని పాడెనులే దరహాసం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language