విజయ గోలి గజల్
జారిన ఆమని జాడలు మలిగెను
ఓడిన ప్రేమల నీడలు కదిలెను
కరగని శిశిరం దారులు మూసెను
కలతల శిబిరం తలుపులు తెరిచెను
వేదన వేచెను వేకువ వెలుగుకు
తీరము చేరని అలగా నలిగెను
కనులు జారిన కలల రూపమె
చెరగని మరకగ చెక్కిలి నిలిచెను
మనసుల మెలిగిన వ్యధనే గాధగ
నసీబు వ్రాసిన కితాబు మిగిలెను