*ఆత్మగౌరవం అమ్మకానికి
రచన-: విజయ గోలి. గుంటూరు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
స్వచ్చమైన స్వరాజ్య స్పూర్తితో
అమరవీరుల ఆత్మబలిదానాలకి
ఉద్యమాలు పోసిన ఊపిరికి
పంచపదుల వయసు.
రాజకీయ రణరంగంలో
రాటుదేలిన చతురతనే
రచ్చగెలిచిన రాజసం
విశాఖ సాగర తీరంలో
విస్తరించిన ఉక్కు కర్మాగారం
ఆంధ్రుల పరిశ్రమలలో
ప్రగతి వెలుగు పధంలో
గగనం మెరిసిన గౌరవం
వేలమంది ఉపాధిగా
విశాఖ నిలిచిన ఉక్కు
ఆంధ్రుల ఆత్మగౌరవం
అంగడిలో అమ్మకం
అవినీతి అక్రమాల
ఉక్కుపాదం తొక్కివేత
చేతకాని ప్రభుత పైన
చేవచచ్చిన బ్రతుకు నాపి
ఉక్కు పిడికిలి బిగించి
హక్కుకోసం కలిసి నడువు