నా మొదటి రుబాయీ…🌹🌹🌹🌹🌹విజయ గోలి
నినుచూడక నాకనులకు నిదురలేదు కన్నా🌹
మురళివినక నామనసుకు శాంతిలేదు కన్నా🌹
ఒకనిమిషం వేదన మరునిమిషం వేడుకగ🌹
ఊగుతుంది హృదయమే నియతిలేదు కన్నా🌹
శుభోదయం 🌹🌹🌹🌹
రుబాయీ 2
మౌనమేల రాగాలా పిలుపేదిర దొరా🌹
శోధించక మనసుగతిని రావేమిర దొరా🌹
రాధనురా విందుల వేళఇదె మనోహర🌹
వేధించక వేగరార జాగేమిర దొరా🌹
రుబాయీ 3 విజయ గోలి
నందివర్ధనమై నయన మనోహరం నీవె🌹
చెంగలువల చెలిమి పరిమళ సుమహారం నీవె🌹
మది మీటిన మోహనరాగం సమ్మోహనమై🌹
మువ్వలసడి రాయంచల సుకుమారం నీవె🌹
రుబాయీ. 4. విజయ గోలి
కామంతో మూసుకున్న కంటిచూపు ఒంపు🌹
కుళ్ళినట్టి కుక్కశవం వాసనెంతొ ఇంపు🌹
మదమెక్కిన మృగాడి వేటకి లేదు మాటు🌹
అవగుణాలు సరిచేయగ అమ్మకత్తి సొంపు🌹
శుభోదయం 🌹🌹🌹🌹🌹
రుబాయీ 5 విజయ గోలి
ప్రేమెంత గమ్మత్తుగ చేసేరు కన్నయ్యా🌹
నీ మ్రోల మోకరిల్లి వేడేరు కన్నయ్యా🌹
నీవుతప్ప గతిలేదని నీప్రేమ అడగరు🌹
కోరుకున్న మనసు కొలువడిగేరు కన్నయ్యా🌹
రుబాయీ 6. విజయ గోలి
నవ్వులలో మువ్వలే రాలినట్లు ఉన్నది🌹
పలుకులలో తేనెలే వొలికినట్లు ఉన్నది🌹
వంపుసొంపు ఒదిగే వసంతమే నీవుగ🌹
రాగాలలొ కోయిలే ఓడినట్లు ఉన్నది🌹
శుభోదయం 🌹🌹🌹🌹🌹
రుబాయి 7. విజయ గోలి
ఆకాశంలో ఆశలు వెతకకు ఎప్పుడూ🌹
గాలిలోన నిలబడి కలలు కనకు ఎప్పుడూ🌹
అడగకనే అన్నీవస్తే అర్ధము ఏముంది🌹
ఆట గెలుపు ఆనందం జారకుఎప్పుడూ🌹
శుభోదయం 🌹🌹🌹🌹🌹
రుబాయి 8 విజయ గోలి
గుండెలోన అలజడిగ నీ అడుగుల సవ్వడి🌹
నిలిచిపోయె అధరముల నీ నవ్వుల సవ్వడి🌹
బృందావన పిలుపుల మెరిసిన వేణువు రవళి🌹
మౌనానికి మాటనేర్పె తలపుల సవ్వడి🌹