నిలిచిపోవ నీప్రేమల

గజల్  విజయ గోలి

నిలిచిపోవ నీప్రేమల తోడునవుదు నిత్యముగా
అలిగిపోకు నీనవ్వుల నీడనవుదు ముత్యముగా

ప్రేమలతో ప్రమాణాలు పెనవేసిన బంధముగా
కలకాలం నీజతలో  కలిమినవుదు సత్యముగా

కడలిలోతు ప్రేమలోతు తెలియనిదే అడుగేయక
తేటతెలుపు తెరచాపల తెప్పనవుదు తథ్యముగా

హిమసుమముల బాటలలో తొలికిరణపు స్పర్శలలొ
నులివెచ్చని నీశ్వాసల నిలిచిపోదు రమ్యముగా

కనురెప్పల కౌగిలిలో కనుపాపల బందీగా
ఆమనిగా అరుదెంచిన* విజయమవుదు స్వచ్ఛముగా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language