గజల్ విజయ గోలి
ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవ ఒక్కసారి
కలనైనా నీరూపును చూపలేవ ఒక్కసారి
ఎదురుచూతు ప్రియతమా వేలవేల జన్మలైన
వసంతమై వచ్చెదనని పలకలేవ ఒక్కసారి
మరుజన్మల వరమన్నది ఆశలేగ ఎప్పటికీ
పదిలముగా నీ ప్రేమని పంచలేవ ఒక్కసారి
నీఊసులు. మోసిమోసి గాయపడిన గుండెనడుగు
వెనుకతిరిగి వేదనేదొ చూడలేవ ఒక్కసారి
మధువులోని మత్తులాగా వదలకుంది నీ ధ్యాసే
మౌనమేల మనసుతలుపు తీయలేవ ఒక్కసారి