నివురు కప్పిన నిప్పు విజయ గోలి
పరాశక్తి పరమేశ్వరి ఆది స్ఫూర్తి ..
వారసత్వపు బాటలో సత్యభామ ..సదా..స్ఫూర్తి..
ముదితల్ నేర్వగరాని విద్య కలదే…
ముద్దార నేర్పింపగాన్ …..
నిజంపై…కొన్నాళ్ళు ..నీళ్లు చల్లారు ..
నివురు కప్పిన నిప్పులా ..
నిజం రాజుకుంటుంది ..
మాతృస్వామ్యం మళ్ళి వస్తూంది..
వరకట్నం నెత్తిమీద ..
కన్యాశుల్కం కదం మొదలు..
అమ్మలు ,అమ్మాయిలు సైకిళ్ళు …
అమ్మమ్మలు బైకులు …
ఇదేమి కొత్తకాదు మాకు …
చరిత్రలో ఇంతకు మించిన సాహసాలే..మావి..
అణచివేత నుండి మళ్ళీ అంకురిస్తోంది …అంతే..
చైతన్యం దిశగా చరణాలు కదుపుతోంది …విజయ గోలి