అప్పగింతలు

అప్పగింతలు     విజయ గోలి

మెట్టినింటికి బిడ్డను అప్పచెప్పే వేళ..
అమ్మనాన్నల గుండెలవిసి పోయెను ..
అన్నదమ్ముల మోము కళ దప్పి పోయేను..
ఆడ  పిల్లవే…నీవంటూ..
అతిధివే  ఈడ నీవంటూ….

మక్కువతో పెంచాము మా ఇంటి లక్ష్మిని …
మనసార మీకు అప్పగించేము..తప్పొప్పులెంచొద్దు…తను చిన్నపిల్ల ..
మారాడగా తెలియదు ..మర్మమే లేదు …
అన్నదమ్ముల మధ్య మెప్పుగా పెరిగింది ..

బంధాల విలువ బహు బాగ తెలియు..
పెద్దలంటే భక్తి ..పిన్నలంటే ప్రేమ. …
సంశయమే లేదు సరి ఐన జోడి..
మీ ఇంటి బిడ్డగా ఆదరించండి…..అంటూ..

అక్కున చేర్చుకుని అల్లాడు తండ్రికి ..
గుండెనిండిన బాధ గొంతు దాటిరాక …
ఎదపైన తలవాల్చి వెక్కిళ్ళతో ..
ఏనాటికి…నేను నీ బిడ్డనే నాన్న …
ఏడవకు ..నీవంటూ కన్నుల కన్నీరు దాచుకుని..
భర్తతో వెడలేటి బంగారు తల్లిని…

గుండె నిండుగా దీవిస్తూ …
కదిలి పోతున్న బిడ్డను ..వదలలేక
పొగిలి ఏడ్చే తల్లి …కడుపు బాధ..
*ఆడపిల్లల అప్పగింత …
తల్లితండ్రుల ..అనుభవంలో …
అర్ధం కాని ఆనందం..మధురమైన ఒక బాధ..
😢

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language